Responsive Header with Date and Time

మోక్షదా ఏకాదశి రోజున ఇలా పూజ చేస్తే- నరక బాధల నుంచి విముక్తి ఖాయం!

Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-01 00:01:20


మోక్షదా ఏకాదశి  రోజున ఇలా పూజ చేస్తే- నరక బాధల నుంచి విముక్తి ఖాయం!

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : పేరులోనే మోక్షాన్ని నింపుకున్న ఈ ఏకాదశి రోజు చేసే వ్రతం మనతో పాటు మన పూర్వీకులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి మాసంలో రెండు ఏకాదశులు ఉంటాయి. అందులో కొన్ని ఏకాదశులు విశిష్టమైనవి. ప్రత్యేకించి మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి విశిష్టమైనది. ఈ కథనంలో మోక్షదా ఏకాదశి వ్రతం విశిష్టతను తెలుసుకుందాం.

మోక్షదా ఏకాదశి ఎప్పుడు?
డిసెంబర్ 1, సోమవారం మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షదా ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఇదే రోజు గీతా జయంతి కూడా జరుపుకోవడం విశేషం.

మోక్షదా ఏకాదశి విశిష్టత
మానవునిగా జనించిన ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, కోరికలు ఉండడం సహజం. అవి తీర్చుకోవడం కోసం భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ సాధకునికి ఉండాల్సిన అసలైన కోరిక మోక్షాన్ని పొందడమే అయిఉండాలి.

జనన మరణ చక్రభ్రమణం
పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం మరలా జన్మించడం, మళ్లీ మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ వుండటం జరుగుతూ వుంటాయి. ఈ చక్రభ్రమణం నుంచి కాపాడేది మోక్షదా ఏకాదశి వ్రతం. మోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమౌతుంది. మోక్ష సాధన కోసం ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మోక్షం లభిస్తుందని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉంది. మోక్షదా ఏకాదశి రోజు విష్ణుపూజ ఎలా చేయాలో చూద్దాం.

మోక్షదా ఏకాదశి పూజా విధానం

మోక్షదా ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. ఈ రోజు ఉపవాసం ఆచరించడం ఎంతో పవిత్రం. ఈ ఉపవాసాన్ని ఏకాదశి నాటి సూర్యోదయం నుంచి మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం వరకు చేయాల్సి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో మోక్షదా ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి మరణానంతరం మోక్షం లభిస్తుందని విశ్వాసం.

విష్ణు పూజ : ఈ రోజు పూజామందిరంలో విష్ణుమూర్తిని ప్రతిష్టించి పంచామృతాలతో అభిషేకించి , షోడశోపచారాలతో పూజించాలి. విష్ణుమూర్తి పూజలో తులసి దళాలు తప్పనిసరి. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి. భక్తిశ్రద్ధలతో ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే పునఃపూజ చేసి శ్రీమన్నారాయణుని మహానైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

మోక్షదా ఏకాదశి కథ : పూర్వం వైఖానసుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు తన ప్రజలను కన్నబిడ్డల వలే చూసుకుంటూ చక్కగా పరిపాలించేవాడు. ఒకరోజు రాత్రి ఆ రాజుకు ఒక కల వచ్చింది. అందులో తన తల్లిదండ్రులతో సహా తన పూర్వీకులందరూ నరకంలో నానాబాధలు పడటం చూశాడు. మరుసటిరోజు తెల్లవారుజామున రాజు తన రాజ్యంలోని పండిత బ్రాహ్మణులని సమావేశపరచి తన కల గురించి చెప్పాడు. రాజు బ్రాహ్మణులతో \"నా పూర్వీకులు నరకంలో బాధ పడటం చూడలేకుండా ఉన్నాను... వారికి ఈ నరకబాధలు పోయే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని\" కోరాడు.

పండితుల సలహా : రాజు మాటలకు పండితులు బాగా ఆలోచించి \\\"ఓ రాజా! ఇక్కడకు సమీపంలోనే పర్వతముని నివసించే గొప్ప ఆశ్రమం ఉంది. ఈ మునిశ్రేష్ఠునికి భూత, వర్తమాన, భవిష్యత్తు జ్ఞానం ఉంది. నువ్వు ఆ మునిని దర్శిస్తే నీకు తరుణోపాయం చెబుతాడు\\\" అని చెప్తారు.