Responsive Header with Date and Time

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Category : ఆరోగ్యం | Sub Category : health Posted on 2025-12-01 20:55:08


ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :ఆరోగ్యకరమైన జీవితానికి ఉదయం తీసుకునే అల్పాహారం అత్యంత ముఖ్యమైనది. మీ ఆరోగ్యం ఉదయం పూట అల్పాహారంగా ఏమి తింటారనేదానిపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఉదయం తొందరలో బ్రేక్‌ ఫాస్ట్ తీసుకోకుండానే హడావిడిగా వెళ్లిపోతుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం.

ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్ దాటవేసే అలవాటు క్రమంగా జీవక్రియ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీంతో బొడ్డు కొవ్వు, అధిక రక్తపోటు, అధిక చక్కెర, చెడు కొలెస్ట్రాల్ ఒకేసారి పెరుగుతాయి.

నిజానికి, ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లకండి. ఏది ఏమైనా అల్పాహారం తీసుకోవడం అవసరం.

కొంతమందికి బ్రేక్‌ ఫాస్ట్ తీసుకోకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోతారు. ఆ తర్వాత బయట రోడ్డు పక్కన దొరికే ఏదైనా చిరుతిళ్లు తినడం అలవాటు. అయితే, ప్రతిరోజూ ఇలా బయట తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రేక్‌ ఫాస్ట్‌గా ఉదయం తీసుకునే ఆహారం రోజు మొత్తం మీ శక్తిని నిర్ణయిస్తుంది. అందుకే ఉదయం పూట ఆరోగ్య కరమైన ఆహారాలు మీ బ్రేక్‌ ఫాస్ట్‌లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఉదయం అల్పాహారంలో జ్యూస్ కూడా తీసుకోవచ్చు.