Responsive Header with Date and Time

ఫ్లైఓవర్‌ పై నుంచి పడిపోయిన కారు…

Category : నేరం | Sub Category : crime Posted on 2025-12-02 21:47:08


 ఫ్లైఓవర్‌ పై నుంచి పడిపోయిన కారు…

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రామాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డిసెంబర్ 1, సోమవారం తెల్లవారుజామున సిహాని గేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక స్విఫ్ట్ కారు ఫ్లైఓవర్ రెయిలింగ్‌ను ఢీకొట్టి కింద పడింది. అనంతరం PWD గెస్ట్ హౌస్ ఆవరణలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వాహనం నియంత్రణ కోల్పోయి ఫ్లైఓవర్ నుండి పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఫ్రీహోల్డ్ గుల్ధార్-II నివాసి రాకేష్ కుమార్ (48) అక్కడికి చేరుకునేలోపే మరణించాడని, జాగృతి విహార్ సంజయ్ నగర్‌కు చెందిన అతని కుమారుడు ప్రిన్స్ పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు.

తీవ్రంగా దెబ్బతిన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.