Responsive Header with Date and Time

పాలు తాగినప్పుడు ఇలాంటి ఆహారాలు అస్సలు తినకూడదు..

Category : జీవనశైలి | Sub Category : healith tips Posted on 2025-12-03 21:26:48


పాలు తాగినప్పుడు ఇలాంటి ఆహారాలు అస్సలు తినకూడదు..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : పాలు మన రోజువారీ ఆహారంలో అత్యంత పోషకమైన భాగాలలో ఒకటిగా చెబుతారు. పాలు శరీరానికి కావాల్సిన బలాన్ని అందిస్తాయి. శరీర పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కానీ పాలను కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తీసుకోకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం…

చాలా మందికి పాలు అన్ని రకాల ఆహారాలతో తీసుకోకూడదని తెలియదు. అలాంటప్పుడు పాలను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోవటం వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. పాలతో కలిపి ఎప్పుడూ తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ కాంబినేషన్ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

పాలు నారింజ, నిమ్మ, జామ, ఇతర పుల్లని పండ్లు పాలతో కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ తీసుకుంటే అవి కడుపులో పాలు గడ్డ కట్టేలా చేస్తాయి. దీని వలన అజీర్ణం, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పాలు, చేపలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చర్మంపై మచ్చలు, అలర్జీలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. పాలు, ఉప్పు కలిగిన ఆహారాల కలయిక జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. శరీర జీవక్రియ ప్రక్రియను బలహీనపరుస్తుంది. ఇది భారంగా, అసౌకర్యంగా ఉంటుంది.

పాలతో ఊరగాయ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే పులియబెట్టడం, మసాలా దినుసులు పాలు చల్లదనాన్ని దెబ్బతీస్తాయి. పాలతో ఉల్లిపాయలను తీసుకోవడం హానికరం అని చెబుతారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని, విషాలను పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో అసమతుల్యతకు దారితీస్తుంది. పాలు, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దురద లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాటి వ్యతిరేక లక్షణాలు శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి.