Category : వినోదం | Sub Category : movies Posted on 2025-12-03 21:46:24
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్ (85) కన్నుముశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గురువారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖులు శరవణన్‌కు నివాళులర్పిస్తున్నారు.
తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శరవణన్ పలు హిట్ చిత్రాలను నిర్మించి గుర్తింపుతెచ్చుకున్నారు. ఏవీఎం బ్యానర్‌పై మొత్తం 300 సినిమాలకు పైగా అందించారు. తెలుగులో \'సంసారం ఒక చదరంగం\', \'ఆ ఒక్కటీ అడక్కు\', \'మెరుపు కలలు\', \'జెమిని\', \'శివాజీ\' వంటి సినిమాలను నిర్మించారు.