Category : వినోదం | Sub Category : movies Posted on 2025-12-03 21:55:01
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం. మొదటి సినిమాతో హిట్ కొట్టి తర్వాత ఒక్క హిట్ కూడా లేని నటులు ఉంటారు. అయినా వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నా, నటన, అందంతో అలరిస్తున్నా.. హిట్ మాత్రం అందనంత దూరంలోనే ఉంటుంది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హద్దులు లేవు. అన్ని భాషలలోనూ నటీనటులకు సమాన అవకాశాలు దక్కుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి సినిమా అవకాశాలు అందుకోవడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని భాషల సినిమాలు చేసే అవకాశం అందుకుంటున్నారు హీరోయిన్లు. ఈ భాషలో సక్సెస్ అందుకోలేకున్నా, అవకాశాలు తగ్గినా ఏ మాత్రం ఆలోచించకుండా వేరే భాషల వైపు దృష్టిపెడుతున్నారు.
ప్రస్తుతం ఆ జాబితాలో చేరింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ గుర్తింపును సాధించుకున్న యంగ్ బ్యూటీలలో ఒకరు కృతి. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ సినిమాల్లోనూ రాణిస్తోంది. తనకు ఇష్టమైన హీరోలు చాలామంది ఉన్నారు కానీ, ఒక్క హీరోకి మాత్రమే తను పెద్ద ఫ్యాన్ అంటోంది కృతి.