Responsive Header with Date and Time

టెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల.. డైన్‌లోడ్‌ లింక్‌ ఇదే! రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే..

Category : ఆంధ్ర ప్రదేశ్ | Sub Category : Breaking News Posted on 2025-12-03 22:30:11


టెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల.. డైన్‌లోడ్‌ లింక్‌ ఇదే! రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ 2025) రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ వివరాలు నమోదు చేసి, టెట్ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ రాత పరీక్షలు డిసెంబర్‌ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు విడతల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా టెట్‌కు ఈసారి టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

రాత పరీక్షల అనంతరం షెడ్యూల్‌ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2న విడుదల చేస్తారు. ఇక ఫైనల్‌ కీ జనవరి 13న వెల్లడించి, తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నారు. ఇక వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 16వేలకు పైగా పోస్టులు భర్తీచేసింది. అయితే ఇందులో మిగిలిన పోస్టులతోపాటు కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో టెట్‌కు మరోమారు నిరుద్యోగులు తమ వెయిటేజీ మార్కులు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.