Responsive Header with Date and Time

బంగారంలాంటి ఆరోగ్యానికి బంగాళదుంప జ్యూస్..!

Category : జీవనశైలి | Sub Category : healith tips Posted on 2025-12-05 22:04:23


బంగారంలాంటి ఆరోగ్యానికి బంగాళదుంప జ్యూస్..!

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఏదో ఒక జ్యూస్‌తో తమ రోజును మొదలుపెడుతున్నారు. క్యారెట్ జ్యూస్, బీట్‌రూట్, ఏబీసీ జ్యూస్, టమాటా జ్యూస్‌, కొత్తిమీర జ్యూస్‌ ఇలా రకరకాల జ్యూస్‌లు చేసుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు గుమ్మడి కాయ, సొరకాయ, కాకరకాయ జ్యూస్‌లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా బంగాళదుంప జ్యూస్‌ ట్రై చేశారా…? కానీ, ఇది ఆరోగ్యానికి అద్భుతం చేస్తుందని నిపుణులు చెబుతున్నార. ప్రతిరోజూ బంగాళాదుంప జ్యూస్‌ తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

బంగాళాదుంపలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. కడుపులో అల్సర్లు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికే జీర్ణ సంబంధిత వ్యాధులు, ఇతర కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా బంగాళాదుంప రసాన్ని ప్రయత్నించాలి. ఇది మంచి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. బంగాళాదుంప రసం కళ్ళు, చర్మం, దంతాలు, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బంగాళాదుంపతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే రాగి, మాంగనీస్, పొటాషియం, బి-విటమిన్‌లను కలిగి ఉంటాయి. బంగాళాదుంప రసంలో లభించే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం బంగాళాదుంప రసం తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.