Category : వినోదం | Sub Category : movies Posted on 2025-12-05 22:07:43
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా, డైరెక్టర్ గా.. టాలీవుడ్ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యారు జేడీ. శివ, ప్రేమ ఖైదీ, మనీ, మనీ మనీ, గులాబి, దెయ్యం, బొంబాయి ప్రియుడు, సత్య తదితర సినిమాలతో జేడీ చక్రవర్తి బాగా ఫేమస్ అయ్యాడు. డైరెక్టర్ గానూ కొన్న సినిమాలు తీసిన జేడీ ఆ మధ్యన దయా అనే ఓ వెబ్ సిరీస్ తోనూ మెప్పించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. జేడీ చక్రవర్తి సింపుల్ గా ఉంటాడు. బయట ఎక్కువగా కనిపించడు. తన సినిమా ఈవెంట్స్ లోనూ అదీ అవసరమైతే మాత్రమే కనిపిస్తాడు. ఇక చాలా మంది నమ్మలేని నిజం ఏమిటంటే.. ఈ స్టార్ నటుడికి ఇప్పటివరకు సోషల్ మీడియా ఖాతాలు లేవట. మీరు అవునన్నా.. కాదన్నా ఇది నమ్మి తీరాల్సిందే. లేటెస్ట్ గానే ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు జేడీ ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా ప్రకటించింది. జేడీ మ్యాక్స్ మోడ్ పేరుతో ఈ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఇందులో జేడీకి సంబంధించిన ఓ వీడియోను కూడా చేశారు
నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. నేను దేవుళ్లను నమ్ముతాను.. అందరి దేవుళ్లను నమ్ముతాను.. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా’ అంటూ తనదైన శైలిలో జేడీ చక్రవర్తి మాట్లాడారు. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన జేడీ.. ‘ఒపీనియన్ కి ఫ్రీడమ్ ఉంది.. కానీ డివోషన్ కు బౌండరీ ఉంది.. మీ జేడీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ‘వెల్కమ్ సార్’ అంటూ నెటిజన్లు జేడీకి స్వాగతం చెబుతున్నారు.
కాగా జేడీ చక్రవర్తి విలన్ గా నటించిన శివ సినిమా ఇటీవలే మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రీ రిలీజ్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక జేడీ చక్రవర్తి చివరిగా దయా అనే ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. దీని తర్వాత మరే సినిమాను , సిరీస్ ను గాను అనౌన్స్ చేయలేదీ స్టార్ యాక్టర్. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసి అభిమానులకు టచ్ లోకి వచ్చిన జేడీ తన సినిమా అప్డేట్స్ ఏమైనా ఇస్తాడో చూడాలి.