Responsive Header with Date and Time

‘పుష్ప 2’ ప్రభంజనానికి ఏడాది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్!

Category : వినోదం | Sub Category : movies Posted on 2025-12-05 22:18:26


‘పుష్ప 2’ ప్రభంజనానికి ఏడాది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్!

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ, భారతీయ సినీ పరిశ్రమలో ఒక సరికొత్త చరిత్రను లిఖించింది. ముఖ్యంగా, ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా రికార్డుల స్థాయిలో వసూళ్లు సాధించి, ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్, కథ, ఎమోషన్, సాంగ్స్, యాక్షన్.. ఇలా ప్రతీ విభాగంలో నెంబర్ వన్‌గా నిలిచి, అల్లు అర్జున్ నటనకు మరో మైలురాయిగా నిలిచింది.

బాక్సాఫీస్‌ వద్ద రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే భారీ హిట్‌గా నిలిచింది. సరిగ్గా ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తున్న వేళ, ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకొని, హీరో అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్‌తో తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు.

‘పుష్ప 2’ సాధించిన భారీ విజయాన్ని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఈ ప్రయాణం కేవలం ఒక సినిమాకు సంబంధించినది కాదని, ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణం అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశిస్తూ… “ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాకు సరికొత్త ధైర్యాన్ని ఇచ్చింది.