Responsive Header with Date and Time

అయ్యో దేవుడా.. శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..

Category : ఆంధ్ర ప్రదేశ్ | Sub Category : Breaking News Posted on 2025-12-05 22:48:12


అయ్యో దేవుడా.. శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తమిళనాడులోని రామనాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. రామనాథపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన వారు మృతి చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి, ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని విజయనగరం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన రామకృష్ణ, మరడ రాము, అప్పలనాయుడు, రామచంద్రరావుగా గుర్తించారు. విషయం తెలిసి వారి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కీళకరై ఈసీఆర్‌ వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును ఢీకొట్టిందని వెల్లడించారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పోలీసులు తెలిపారు.