Category : వినోదం | Sub Category : movies Posted on 2025-11-28 00:21:42
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : టాలీవుడ్ స్టార్ మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల నటించిన చిత్రం \'మాస్ జాతర\'. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందికు వచ్చింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, రవితేజ యాక్టింగ్‌కి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీపై అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఎక్కుడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి
రవితేజ- శ్రీలీల కలిసి నటించిన రెండో సినిమా \'మాస్ జాతర\'. ఇందులో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో సందడి చేశారు. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 28 నుంచే అందుబాటులోకి వచ్చింది. కాగా, ఈ జోడీ ఇదివరకు 2022లో \'ధమాకా\'లో నటించింది. ఆ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్లో చేరారు.