Responsive Header with Date and Time

పూజ తర్వాత ప్రసాదం మిగిలిపోతే ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఇలా చేస్తే మీకు..

Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-11-28 00:32:14


పూజ తర్వాత ప్రసాదం మిగిలిపోతే ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఇలా చేస్తే మీకు..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :  ప్రసాదం కేవలం ఆహారం కాదు.. అది ఆశీర్వాదం, భక్తి, పవిత్ర భావనలతో కూడుకున్నది. అందుకే పూజ ముగిసిన తర్వాత మిగిలిపోయిన ప్రసాదాన్ని ఏమి చేయాలనే దానిపై చాలా మంది గందరగోళానికి గురవుతారు. కొన్నిసార్లు ప్రసాదం ఎక్కువగా మిగిలిపోవడం లేదా చెడిపోవడం జరుగుతుంటుంది. ప్రసాదాన్ని వృథా చేయకుండా, గౌరవంగా చూసుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.


పంచుకోవడం ముఖ్యం

ప్రసాదం ముఖ్య ఉద్దేశం దానిని పది మందికి పంచడం. ఇది సానుకూలతను వ్యాపింపజేస్తుంది. ప్రజలను ఒకచోట చేర్చుతుంది. కుటుంబం, స్నేహితులు, పొరుగువారు లేదా మీ ఇంటికి వచ్చే అతిథులు ఎవరికైనా ప్రసాదాన్ని పంచండి. చిన్న ముక్క అయినా సరే, ఇవ్వడం ముఖ్యం.

పొడి ప్రసాదం నిల్వ – వినియోగం

లడ్డూలు, స్వీట్లు, పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ వంటి పొడిగా ఉండే ప్రసాదాలను నిల్వ చేసుకోవచ్చు. పొడి ప్రసాదాన్ని శుభ్రమైన, గట్టి మూత ఉన్న కంటైనర్‌లో ఉంచండి. స్వీట్లు ఎంతకాలం తాజాగా ఉంటాయో చూసుకోని ఆ లోపే తినేసెయ్యండి. కొన్ని వస్తువులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మరికొన్నింటిని ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయాలి. పండ్లను కూడా ఒకటి రెండు రోజుల్లో తినడం లేదా ఫ్రూట్ సలాడ్‌లో ఉపయోగించడం ఉత్తమం.

వండిన ప్రసాదం నిర్వహణ

హల్వా, ఖీర్, అన్నం లేదా సబ్జీ వంటి వండిన ప్రసాదాలను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకంటే అవి త్వరగా చెడిపోతాయి. వండిన ఆహారం కనుక అదే రోజు తినడానికి ప్రయత్నించండి. నిల్వ చేయాలంటే, ఫ్రిజ్‌లో ఉంచి 24 గంటలలోపు తినేయండి. వడ్డించే ముందు బాగా వేడి చేయండి. చాలా కుటుంబాలు మిగిలిన ప్రసాదాన్ని మరుసటి రోజు అల్పాహారంలో ఉపయోగిస్తాయి.

చెడిపోయిన ప్రసాదాన్ని గౌరవంగా పారవేయడం

కొన్నిసార్లు తెలియకుండానే ప్రసాదం చెడిపోవచ్చు. ఇలా జరిగితే బాధపడకండి. చెడిపోయిన ప్రసాదాన్ని నేరుగా చెత్తబుట్టలో వేయకుండా దానిని శుభ్రమైన కాగితం లేదా గుడ్డలో చుట్టండి. దానిని చెట్టు మొదట్లో లేదా మొక్కల దగ్గర ఉంచండి. ఈ ఆహారం సహజంగా నేలలో కలిసిపోతుంది. ఆహారాన్ని భూమికి తిరిగి ఇచ్చే ఈ పద్ధతిని గౌరవప్రదమైన మార్గంగా భావిస్తారు.