Responsive Header with Date and Time

3 రాష్ట్రాలను వణికించారు.. కట్‌చేస్తే.. విజయవాడలో అడ్డంగా బుక్కయ్యారు..

Category : ఆంధ్ర ప్రదేశ్ | Sub Category : Breaking News Posted on 2025-11-28 00:54:40


 3 రాష్ట్రాలను వణికించారు.. కట్‌చేస్తే.. విజయవాడలో అడ్డంగా బుక్కయ్యారు..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : విజయవాడ బస్టాండ్ ను టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలకు  పాల్పడుతున్న  మహారాష్ట్రకు చెందిన కుప్రసిద్ధపర్తి గ్యాంగ్‌ను పట్టుకున్నారు పోలీసులు. ముఠా సభ్యులైన నలుగురిని అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. నిందితులను విచారించి వారి వద్ద నుంచి దొంగలించిన బంగారు ఆభరణాలు , నగదు , 5.44 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.. విజయవాడ కృష్ణలంక పోలీసుల అందిన సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నలుగురు నిందితులను అరెస్టులు చేశారు.

మొదట నవంబర్ 24న కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నవంబర్ 23న గుంటూరు వెళ్ళేందుకు పండిట్ నెహ్రూ బస్టాండ్ కు వచ్చాడు ..అనంతరం బస్సులో ఎక్కేటప్పుడు తన వద్ద ఉన్న రూ. 44 వేల దోపిడీకి గురైయ్యాయి. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా మరో రెండు దొంగతనాలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బస్టాండ్ లోని ఫ్లాట్ ఫామ్ , ఎంట్రీ ప్రదేశాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను గంటలతరబడి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో పోలీసులు ఓ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. భారీ జనసంద్రంలో కలిసిపోయి ప్రయాణికుల టార్గెట్ చేస క్షణాల్లో ఈ గ్యాంగ్ తన చేతి వాటాన్ని ప్రదర్శించడాన్ని పోలీసులు గమనించారు.

పోలీసుల దర్యాప్తులో నిందితులు నవంబర్ 23న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ నుంచి నగదు.. మరో ప్రయాణికురాలు బ్యాగ్ నుంచి 26 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించినట్లు బయటపడింది. అలాగే నవంబర్ 25న మరో ప్రయాణికుడి బ్యాగ్ నుంచి 24 గ్రాముల బంగారం దొంగలించినట్లు తేలింది. ఈ గ్యాంగ్ పై మహారాష్ట్ర , రాజస్థాన్ , ఒడిస్సా , ప్రాంతాలలో పలు కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

గ్యాంగ్ కదలికల నేపథ్యంలో క్రైమ్ పోలీసులు బస్టాండ్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానితుల కదలికలు కనిపించడంతో సీతమ్మ విగ్రహ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగలించిన బంగారు ఆభరణాలు నగదు స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.