Responsive Header with Date and Time

హాంకాంగ్ ప్రమాదంతో హైదరాబాద్ అపార్ట్‌మెంట్ వాసుల్లో టెన్షన్.. వాటిపై స్పెషల్ ఫోకస్..

Category : తెలంగాణ | Sub Category : Breaking News Posted on 2025-11-28 01:05:58


హాంకాంగ్ ప్రమాదంతో హైదరాబాద్ అపార్ట్‌మెంట్ వాసుల్లో టెన్షన్.. వాటిపై స్పెషల్ ఫోకస్..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : హాంకాంగ్‌ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా నిలిచిన అగ్నిప్రమాదంలో 94 మంది మరణించడం అందరినీ కలిచివేస్తోంది. వాంగ్ ఫక్ కోర్టు నివాస సముదాయంలోని అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 200 మందికి పైగా ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. 72మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల నివాసితుల్లో ఊహించని భయాన్ని, ఆందోళనను రేపుతోంది. సాధారణంగా తమ భద్రతపై పూర్తి నమ్మకంతో ఉండే సంపన్న అపార్ట్‌మెంట్లలో ఈ సంఘటన ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

హాంకాంగ్‌లో ఆధునిక టవర్లు కూడా నిమిషాల వ్యవధిలో వేగంగా కూలిపోతున్న దృశ్యాలు, హైదరాబాద్ నివాసితుల సేఫ్టీ నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నర్సింగి, తెల్లాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లోని నివాసితులు ఈ విషాదం.. అత్యంత అధునాతన భవనాలు కూడా కొన్ని లోపాల వల్ల ఎంత దారుణంగా మారుతాయో గుర్తుచేస్తుందని అంటున్నారు. భవనం బయట ఉన్న సామగ్రి నుండి మొత్తం టవర్ బ్లాక్‌కు నిమిషాల్లో మంటలు వ్యాపించడం చాలా ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌లో మంటలు సాధారణంగా షార్ట్ సర్క్యూట్‌లతో ముడిపడి ఉంటాయి. అయితే 30 నుంచి 50 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న టవర్లలో ఇలాంటి పరిస్థితి వస్తే, తమ కమ్యూనిటీలు ఎంత సిద్ధంగా ఉన్నాయనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

చర్చకు దారితీసిన అంశాలు

ఈ హాంకాంగ్ ఎపిసోడ్ హైదరాబాద్ నివాసితులకు భద్రతా ప్రమాణాల చెకింగ్‌కు ఉపయోగపడింది. ప్రస్తుతం అనేక ముఖ్యమైన అంశాలపై ప్రజలు, బిల్డర్లు దృష్టి సారించారు. అందులో ప్రధానంగా ఇవి ఉన్నాయి..