Category : వినోదం | Sub Category : movies Posted on 2025-11-30 21:53:37
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : రణ్ వీర్ కాంతారా బాగుందన్నాడు. రిషబ్‌శెట్టి నటన అద్భుతమన్నాడు. కాంతార-3లో తనకు ఛాన్స్ ఇస్తారా అని కూడా అడిగాడు.. కానీ.. ఈ డైలాగ్‌లన్నీ ఒకేఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో కొట్టుకుపోయాయి. కన్నడ సంప్రదాయాల్ని అవమానించారనే కోపమే ఇప్పుడు అందరిలో కనిపిస్తోంది. 2025లో రిలీజైన అన్ని సినిమాల్లోకంటే కూడా కాంతారానే టాప్. అన్ని భాషాల్లోనూ మంచి ఆదరణ వచ్చింది సినిమాకి. దేవతకీ, దెయ్యానికీ తేడా తేలియనట్టుగా రణ్‌వీర్ స్టేజ్‌పై చూపించిన హావభావాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇటీవలే మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా దక్షిణాది సినిమాలపై చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. సౌతిండియన్ సినిమాల్లో విలన్లుగా బాలీవుడ్ హీరోలను తీసుకోవడం తనకు నచ్చడం లేదన్నారు. ఆ మాటలు ఇంకా మర్చిపోకముందే.. కన్నడ సూపర్ హిట్ సినిమాని అవహేళన చేసేలా రణ్‌వీర్ చేష్టలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.