Category : జీవనశైలి | Sub Category : healith tips Posted on 2025-11-30 22:10:56
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :నాన్‌వెజ్ అంటే తినలేని వారు మాంసాహార ఆహారానికి ప్రత్యామ్నాయంగా శాఖాహారులు మీల్ మేకర్ తింటున్నారు. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల, ప్రతిరోజూ దీనిని తినే వారు కూడా ఉన్నారు. సోయా నుండి నూనె తీసి, గుజ్జును ఆహార ఉత్పత్తిగా తయారు చేస్తారు. మీల్ మేకర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొవ్వులు ఉండవు. మాంసం కాకుండా బిర్యానీలో వండుకుంటే శాఖాహారులు దీన్ని ఇష్టంగా తింటారు. అయితే, ఏది ఎక్కువగా తినకూడదు అనే విషయం అన్ని మీల్ మేకర్ కు కూడా వర్తిస్తుంది. మీల్ మేకర్ ఎక్కువగా తినడం వల్ లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మీల్‌మేకర్ అప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
మీల్ మేకర్‌లో సోయా అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా తింటే సమస్యలు రావచ్చు. ఎక్కువ సోయా హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. అధికంగా తినడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. సోయా ఎక్కువగా తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు పెరగవచ్చు. అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వారానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. మితంగా తీసుకుంటే మీల్ మేకర్ శరీరానికి మేలు చేస్తుంది.
మీల్‌మేకర్ ఎక్కువగా తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత మారుతుంది. దీనివల్ల పురుషులకు కొన్ని తీవ్రమైన సమస్యలు వస్తాయి. కొంతమంది పిల్లలు పోషకాహార లోపాలతో బాధపడే అవకాశం ఉంది. వారికి అలెర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల అనేక క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి. అంతే కాదు, దీన్ని తినడం వల్ల ఖనిజ లోపాలు కూడా వస్తాయి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇతర పోషకాలు కూడా లోపిస్తాయి. ఈ మీల్ మేకర్‌లోని ఫైటోఈస్ట్రోజెన్ మన మూత్రపిండాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. పాలిచ్చే మహిళలు, గర్భిణీ స్త్రీలు వైద్యుడిని సంప్రదించకుండా మీల్ మేకర్స్ తినకూడదు.