Category : జీవనశైలి | Sub Category : healith tips Posted on 2025-11-30 22:21:54
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్ కారణంగా ప్రజలు సరైన ఆహారం, నిద్రకు దూరమవుతున్నారు. దీంతో వయసుతో సంబంధం లేకుండా ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారినపడుతున్నారు. చిన్న వయసులోనే బీపీ, షుగర్, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. అంతేకాదు…ఇప్పుడు అంతా గుండె సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అందరిలోనూ గుండె సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. చలికాలం అయితే ఈ సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. నిజానికి గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
గుండెను శక్తివంతంగా తయారు చేసేందుకు వెల్లుల్లి రెబ్బలు ఎంతగానో సహాయపడతాయి. రోజుకు రెండు ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ (Allicin) అనే సమ్మేళనం చెడు కొవ్వును కరిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
వెల్లుల్లి రెబ్బలు శరీరంలో మంచి కొవ్వును పెంచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. చెడు కొవ్వు తొలగిపోయి మంచి కొవ్వు పెరగడం కారణంగా గుండె శక్తివంతంగా తయారవుతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు రక్తపోటును నియంత్రించే అద్భుతమైన గుణాలుంటాయి. దీనివల్ల పూర్తిగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.